గుంటూరు జిల్లాకు గుడ్ న్యూస్.. రూ. 143 కోట్లు మంజూరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-01 12:22:46  IST  )

గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ..

గుంటూరు జిల్లాకు గుడ్ న్యూస్.. రూ. 143 కోట్లు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District)కు కేంద్రం(Central) గుడ్‌న్యూస్ తెలిపింది. రూ. 143 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) వెల్లడించారు. మిగిలిన జిల్లాలకు రూ.80.41 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 20 రోడ్ల పనులకు కేంద్రం ఈ నిధులను మంజూరు చేసినట్లు పెమ్మసాని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించిన జగన్(Jagan) ప్రభుత్వం.. రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సూచనలతో రాష్ట్రంలోని రోడ్లకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తున్నామని పెమ్మసాని పేర్కొన్నారు.

Next Story