విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం

by Ajay Maddhiboyina |

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్న కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్న కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రశ్నించగా ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్‌కు ఇప్పటి వరకు 1017 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ చేసుకున్నారని పేర్కొన్నారు. రూ.11,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దానికి గాను ఇప్పటి వరకు రూ.984 కోట్లు విడుదల చేశామన్నారు.

Next Story