ఏయూలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు.. సందడి చేసిన సచిన్ టెండూల్కర్

by Vemula.Srinu Prasad |

విశాఖ సాగరతీరాన విద్యాకుసుమంలా విరిసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి....

ఏయూలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు.. సందడి చేసిన సచిన్ టెండూల్కర్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) సాగరతీరాన విద్యాకుసుమంలా విరిసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాలు (Centenary celebrations) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇంజినీరింగ్‌ కాలేజ్ గ్రౌండ్స్‌(Engineering College Grounds)లో ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్(Vice President of India Jagdeep Dhankhar) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్. ఏయూ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ దేశానికి అందించిన మేధావులను, విశిష్ట సేవలను ఈ వేదికపై స్మరించుకున్నారు.

విశిష్ట అతిథిగా సచిన్

ఈ వేడుకల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) విశిష్ట అతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడా, రాజకీయ, విద్యా రంగాలకు చెందిన ప్రముఖుల కలయికతో ఏయూ ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన అతిథులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, అది తెలుగు వారి ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఈ శతాబ్ది ఉత్సవాలు వర్తమాన విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ, భవిష్యత్తు లక్ష్యాల దిశగా పని చేసేలా ప్రేరేపిస్తున్నాయని పేర్కొన్నారు.

Next Story