శ్రీశైలం మల్లికార్జునుడి సేవలో సీఈసీ జ్ఞానేష్ కుమార్

by Naga Rani Yarlagadda |

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీశైలంలో వేంచేసియున్న శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి..

శ్రీశైలం మల్లికార్జునుడి సేవలో సీఈసీ జ్ఞానేష్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీశైలంలో వేంచేసియున్న శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ దంపతులు ఆలయ ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్ఠింపబడిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. శివయ్య, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, ఇది తమ కుటుంబానికి మరచిపోలేని అనుభూతిగా నిలుస్తుందన్నారు.

Next Story