లేడీస్ హాస్టల్‌ వాష్ రూమ్ వైపు సీసీ కెమెరాలు.. కేసు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-05 04:31:31  IST  )

గుంటూరు బ్రాడీపేటలోని లేడీస్ హాస్టల్‌లో సీసీ కెమెరాల కలకలం రేగింది..

లేడీస్ హాస్టల్‌ వాష్ రూమ్ వైపు సీసీ కెమెరాలు.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు బ్రాడీపేట(Bradipet)లోని లేడీస్ హాస్టల్‌(Ladies Hostel)లో సీసీ కెమెరాల కలకలం రేగింది. వాష్ రూమ్ కవర్ చేస్తూ హాస్టల్ నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థిని ఆరోపించారు. అంతేకాదు తమను వేధిస్తున్నారంటూ వాపోయారు. ప్రశ్నించిన తమ పట్ల హాస్టల్ నిర్వాకుడి భార్య సైతం అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకుడితో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే విద్యార్థిని హాస్టల్ ఫీజు చెల్లించలేదని, డబ్బులు కట్టాలని అడిగినందుకే తమపై ఫిర్యాదు చేసిందని హాస్టల్ నిర్వాహకుడు చెప్పారు. కారిడార్‌లో సీసీ కెమెరా ఏర్పాటు చేశామని, వాష్ రూమ్ కవర్ చేయాలని కాదని తెలిపారు. విద్యార్థినిలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెంటనే వేరే వైపునకు తిప్పామని పేర్కొన్నారు.

Next Story