Breaking: వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది....

Breaking: వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)కి సీబీఐ ప్రత్యేక కోర్టు(Cbi Special Court)లో ఊరట లభించింది. విదేశీ పర్యటన(Foreign trip)కు వెళ్లేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15 వరకు సుమారు రెండు వారాల పాటు ఆయన యూరప్, యూకే(Europe, UK) దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కేసుల నేపథ్యంలో దేశం దాటొద్దన్న నిబంధనల మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కొన్ని నిబంధనలతో గ్రీన్ సిగ్నల్

దీంతో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కొన్ని నిబంధనలతో ఈ విదేశీ పర్యటనకు అంగీకరించింది. తన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, బస చేసే ప్రదేశాల వివరాలు, ఫోన్ నంబర్లను సీబీఐకి, కోర్టుకు సమర్పించాలని సూచించింది. అలాగే పర్యటనకు సంబంధించి రూ. 1 లక్ష పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరుకావాలని, ఒకవేళ నేరుగా రాలేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తన రాకను ధృవీకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

గతంలోనూ ఇదే మాదిరి...

కాగా గతంలోనూ జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి అనుమతులనే కోర్టు ద్వారా తీసుకున్నారు. కానీ ఈసారి సీబీఐ కోర్టు మరింత పకడ్బందీగా షరతులను విధించింది. ప్రధానంగా విచారణలో ఉన్న కేసులకు సంబంధించి సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకూడదని న్యాయస్థానం జగన్‌కు గట్టిగా ఆదేశాలు జారీ చేసింది.

Next Story