- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిVijayasai Reddyకి విదేశీ పర్యటన(Foreign Trip)కు సీబీఐ కోర్టు(CBI Court) అనుమతినిచ్చింది(Allows). ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి..రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిVijayasai Reddyకి విదేశీ పర్యటన(Foreign Trip)కు సీబీఐ కోర్టు(CBI Court) అనుమతినిచ్చింది(Allows). ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి..రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రాన్స్, నార్వే దేశాలకు వెళ్లేందుకు నెల రోజులు అనుమతి కావాలని కోరారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో కోర్టు అనుమని కోరుతు ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
విజయసాయిరెడ్డి పిటీషన్ ను విచారించిన సీబీఐ కోర్టు 15 రోజులు పాటు మాత్రమే సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు 15 రోజుల పాటు ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లొచ్చన్న సీబీఐ కోర్టు విజయ సాయి రెడ్డికి సూచించింది. అంతకుముందు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన అనుమతి పిటిషన్‌కు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే విజయ సాయి రెడ్డి తరుఫు న్యాయవాదులు ట్రయల్ కోర్టులో గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఫారెన్ టూర్‌కు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు 15రోజుల పాటు విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో విజయ సాయి రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించినట్లయ్యింది.
ఇటీవల విజయసాయి రెడ్డి అనూహ్యంగా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉప రాష్ట్రపతి వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.






