- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో కత్తితో వ్యక్తి హల్‌చల్.. కొట్టి చంపిన గ్రామస్థులు
జీడీ తోటలో పిక్కల గొడవలో కత్తితో వీరంగం సృష్టించిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ముకులూరు గ్రామంలో జరిగింది. ..

దిశ, వెబ్ డెస్క్: జీడీ తోటలో పిక్కల గొడవలో కత్తితో వీరంగం సృష్టించిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ముకులూరు గ్రామంలో జరిగింది. గంగరాజు అనే వ్యక్తి తన జీడీ తోటలోని పిక్కలను దొంగిలిస్తున్నారన్న అనుమానంతో మద్యం మత్తులో కత్తి పట్టుకుని గ్రామంలో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో రమణ, కోటమ్మ, చిన్నబ్బాయి, యర్రబ్బాయి అనే నలుగురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో ప్రాణభయంతో వణికిపోయిన స్థానికులు.. చివరికి ఐకమత్యంతో గంగరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో గ్రామస్థులంతా కలిసి గంగరాజుపై తిరగబడి దాడి చేయడంతో అతను ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






