శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. భక్తుల ఆందోళన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-29 15:30:47  IST  )

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించడంతో కలకలం రేగింది...

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. భక్తుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం లడ్డూ ప్రసాదం(Laddu Prasad)లో బొద్దింక కనిపించడంతో కలకలం రేగింది. ఆదివారం కావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి(Srisailam Shrine) భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేశారు. అయితే లడ్డూలో బొద్దింక కనిపించింది. దీంతో భక్తుడు నిర్ఘాంతపోయారు. వెంటనే వెళ్లి గుడి సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో భక్తుడి నుంచి లడ్డూను అధికారులు లాక్కున్నారు. వీడియో తీసిన వారిపై ఒత్తిడి చేశారు. సామరస్యంగా మాట్లాడుకుందామని విషయం బయటకు రాకుండా చేసే యత్నం చేశారు. అయితే భక్తులు మాత్రం ఆందోళనకు దిగారు. పవిత్రమైన లడ్డూలో బొద్దింక కనిపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story