CAT: ఐఏఎస్ శివశంకర్‌కు భారీ ఊరట.. క్యాట్ సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |

ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ (IAS Shiva Shankar)కు ఎట్టకులకు భారీ ఊరట లభించింది.

CAT: ఐఏఎస్ శివశంకర్‌కు భారీ ఊరట.. క్యాట్ సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ (IAS Shiva Shankar)కు ఎట్టకులకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు క్యాట్ (Central Administrative Tribunal) సంచలన నిర్ణయం తీసుకుంది. శివశంకర్‌ను వెంటనే ఏపీకి కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా నాలుగు వారాల్లోగా ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డీవోపీటీ (DOPT)కి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఐఏఎస్ క్యాడర్ విభజనలో భాగంగా తనను తెలంగాణలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను శివశంకర్ సవాలు చూస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ హృషికేశ్ రాయ్ (Justice Hrishikesh Roy), జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (Justice SVN Bhatti) ద్విసభ్య ధర్మాసనం క్యాట్ (CAT), హైకోర్టు (High Court) ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది. కేడర్‌ను డివిజన్ చేస్తూ డీఓపీటీ (DOPT) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలోనే తమను ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ఐఏఎస్‌ శివ శంకర్ (IAS Shiva Shankar), సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు విన్నవించారు. తన సొంత రాష్ట్రం ఏపీనే అని, పోస్టింగ్‌ తీసుకునే సమయంలో తాత్కాలిక అడ్రస్‌ కింద హైదరాబాద్‌ (Hyderabad) చిరునామాలు ఇచ్చామని సీఎంకు వివరించారు. స్థానికత ఆధారంగా తనను ఇక్కడే కొనసాగించేలా చూడాలని కోరగా వారి అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. డీవోపీటీ అధికారులతో మాట్లాడారు, విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే క్యాట్ (CAT) ఐఏఎస్ లోతేటి శివ శంకర్‌‌ (IAS Shiva Shankar)ను ఏపీ కేడర్‌కే కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story