Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్‌పై కేసులు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-21 06:12:02  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫొటోల మార్ఫింగ్‌(Photos Morphing)పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు(Cases)లు నమోదు చేశారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్‌పై కేసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫొటోల మార్ఫింగ్‌(Photos Morphing)పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు(Cases)లు నమోదు చేశారు. మహా కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వ్యవహారంపై ఏపీలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లలో జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.

పవన్ ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో పవన్ కల్యాణ్ ఫొటో అసభ్య మార్ఫింగ్‌పై కేసు నమోదైంది. చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకిరా, డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలయ్యాయి. అయితే పవన్ ఫోటోలను సోషల్ మీడియాలో కొందరు బాడీ షేమింగ్ చేస్తూ మార్ఫింగ్ చేయడం వివాదస్పదమైంది. దీనిపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఓవైపు పవన్ ఫోటో మార్ఫింగ్ ల వ్యవహారంపై కేసులు నమోదవుతున్నప్పటికి ఇంకోవైపు పవన్ కులం..మతం అంశాలపై సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టుల దాడి సాగుతుండటం ఆసక్తికరంగా మారింది.

Next Story