- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటనపై కేసు నమోదు
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడం కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యంసీసాల ఘటనలో ముగ్గురి పాత్ర ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారిలో ఒక వైసీపీ నేత, ఇద్దరు మీడియా ప్రతినిధులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మొదట వైసీపీ నేత వాహనం ఘటనాస్థలానికి వెళ్లగా.. ఆ తర్వాత ఇద్దరు మీడియా ప్రతినిధులు అక్కడి వెళ్లినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడికి వెళ్లిన ముగ్గురూ ఖాళీ మద్యం బాటిళ్లను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే నిందితులెవరో నిర్ధారించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ అతిథి గృహానికి, ఖాళీ మద్యం బాటిళ్లకు ఎలాంటి సంబంధం లేదని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.
తిరుమలలోని పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలతో తిరుమల అపవిత్రమవుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుని తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించిన ప్రాంతం.. బాలాజీనగర్ కు ఆనుకుని ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చెట్ల మధ్యలో ఉందని స్పష్టం చేసింది. ఇందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.






