- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడూరుపాడులో కత్తుల దాడి ఘటనపై కేసు నమోదు
విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.

దిశ, వెబ్ డెస్క్ : జనవరి 26న నెల్లూరు (Nellore) జిల్లాలోని కోడూరుపాడులో (Kodurupadu) ఓ విద్యార్థిపై కత్తులతో దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేశారు. మొత్తం ఏడుగురిని కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసుల వివరాల ప్రకారం సునంత్ (Sunanth) అనే అబ్బాయి కోడూరులోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలకు వెళ్లాడు. ఆ సమయంలో కొందరు యువకులు బైకుపై పాఠశాల ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడ కాసేపు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. అది గమనించిన విద్యార్థి వారిని అలా ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. విషయాన్ని ఉపాధ్యాయులకు చెబుతానని హెచ్చరించాడు. దీంతో ఆ యువకులు పాఠశాల ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల తరువాత విద్యార్థి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు.
కొద్దిసేపటి తర్వాత కాలనీ బయట విద్యార్థి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ బైకుపై పాఠశాలకు వచ్చిన యువకుల కంటబడ్డాడు. పాఠశాల వద్ద తమను బయటకు పంపిన విషయాన్ని గుర్తుంచుకొని విద్యార్థిపై దౌర్జన్యానికి దిగారు. మద్యం మత్తులో దాడికి యత్నించారు. కత్తులు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. తమ జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరించారు. ఇదంతా గమనించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం ఏడుగురిని కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.






