- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP Vs YCP: టీడీపీ ఫ్లెక్సీలు చించివేత.. వారిపై కేసు నమోదు
కడప జిల్లాలో మూడు రోజులు టీడీపీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం ఘనంగా జరిగింది.

దిశ,వెబ్‌డెస్క్: కడప జిల్లాలో మూడు రోజులు టీడీపీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం ఘనంగా జరిగింది. మహానాడుకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. టీడీపీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. దీంతో కడప జిల్లా మొత్తం పసుపు మయమైంది. జిల్లా వ్యాప్తంగా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో పసుపు మయంగా మారింది. ఈ సందర్భంగా కడప జిల్లా పులివెందులలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసి.. ధ్వంసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై టీడీపీ(TDP) శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటనలో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని ఏ1 చేర్చగా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌ను ఏ5 పేర్కొన్నారు. దీంతో కడప జిల్లాలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.






