టీటీడీ గోశాల పై అసత్య ప్రచారం.. భూమన పై కేసు నమోదు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-18 04:31:46  IST  )

టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా ఆవులు మరణించాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే

టీటీడీ గోశాల పై అసత్య ప్రచారం.. భూమన పై కేసు నమోదు
X

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా ఆవులు మరణించాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమన చేసిన వ్యాఖ్యలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో నిన్న భూమనను టీటీడీ గోశాలను సందర్శించాలని కోరింది. ఈ నేపథ్యంలో నిన్న(గురువారం) తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ పరస్పర సవాళ్లు కొనసాగుతున్నాయి. గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్వీయూ వర్సిటీ సీఐ రామయ్య పేర్కొన్నారు. టీటీడీ గోశాల పై అసత్య ప్రచారం చేస్తూ.. మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో గురువారం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైనట్లు సీఐ రామయ్య తెలిపారు. ఈ క్రమంలో బీఎన్‌ఎస్ 353 (క్లాజ్ 1)299, 74 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైనట్లు సమాచారం.


Next Story