Breaking: మరో వైసీపీ కీలక నేతపై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-03 08:35:26  IST  )

రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి...

Breaking: మరో వైసీపీ కీలక నేతపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల లడ్డూ కల్తీ(Tirumala laddu adulteration) వ్యవహారంలో కోర్టు(Court)కు సీబీఐ(CBI) నివేదిక సమర్పించిన నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వారిపై వరుసగా కేసుల పరంపరం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు జోగి రమేశ్‌( Former Minister Jogi Ramesh)తో పాటు అంబటి రాంబాబుపైనా కేసులు నమోదు అయ్యాయి. సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబు(Ambati Rambabu)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరో కీలక నేతపైనా కేసు నమోదు


ఇప్పుడు తాజాగా మరో కీలక వైసీపీ నేతపైనా పోలీసు కేసు నమోదు అయింది. ఈ నెల 31న వినుకొండ వెంకటేశ్వరస్వామి(Vinukonda Venkateswara Swamy) ఆలయం వద్ద వైసీపీ నేతలు ఆలయ శుద్ధి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా రావడంతో పాటు ఆలయంలో ఒక్కసారిగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు తోపులాట జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో పాటు వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పక్కకు నెట్టివేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు చేశారు. బొల్లా బ్రహ్మణాయుడుతో పాటు 27 మంది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు నమోదు చేశారు. వారందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.

Next Story