- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో బైపోల్.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. 16 మంది పై కేసు నమోదు
రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా పులివెందులలో పొలిటికల్ హీట్ నెలకొంది. జడ్పీటీసీ మరణంతో పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో పులివెందుల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ఉప ఎన్నిక స్థానానికి ఇప్పటికే వైసీపీ, టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు టీడీపీ పోటీ చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జేడ్పీటీసీ బైపోల్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు.
గత రాత్రి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరైన వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ నాగేష్, సన్మోహన్ రెడ్డిలపై టీడీపీకి చెందిన 30 మంది కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడులు చేశారు, అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై దాడి ఘటనలో 16 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు.. టీడీపీ నేత విజయకుమార్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పులివెందులకు చెందిన కొందరు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదైంది.






