అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి ఘటనపై కేసు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-03 05:34:57  IST  )

వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.

అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి ఘటనపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం తన ఇల్లు, కార్యాలయం పై టీడీపీ నేతలు దాడి చేశారని అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని, కిటికీ అద్దాలు పగలగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడులపై చర్యల్లో భాగంగా గుంటూరు పట్టాభిపురం పోలీసులు మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాంప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జి సహా పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. కాగా.. అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా.. అతన్ని విచారించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం బెంచ్ పైకి రానుంది. కస్టడీకి కోర్టు అనుమతిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు ఆయన్ను తీసుకురానున్నారు. సీఎంను అసభ్యపదజాలంతో దూషించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులన్నింటిలో పోలీసులు పీటీ వారంట్లు వేయనున్నట్లు సమాచారం.

Next Story