- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Case Filed: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ సినీనటి మాధవీ లత (Madhavi Latha)పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ (Cyberabad Cyber Crime) పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, తాడిపత్రి (Thadipathri)లోని జేసీ పార్కు (JC Park)లో డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆ ఈవెంట్‌ను కండక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవీ లత (Madhavi Latha) సోషల్ మీడియా (Social Media) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) స్పందిస్తూ మాధవీలతపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆమెను సపోర్ట్ చేసిన బీజేపీ (BJP) నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు మాధవీ లతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ (TDP) మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి టీడీపీ అధిష్టానం ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలతకు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, తీవ్ర భావోద్వేగానికి లోనైన మాధవీ లత, జేసీపై చర్యలు తీసుకోవాలంటూ జనవరి 21న సైబరాబాద్ (Cyberabad) పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy)పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ విషయంలో జేసీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.






