- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు! మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
by Ramesh Naini |
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసు స్టేషన్‌లో టీడీపీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. నానిపై 196(1), 353(2), 351(2), 352 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడారని, పేర్ని వ్యాఖ్యలు సమాజంలో వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పేర్ని నాని పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






