- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతులు లేని ర్యాలీ.. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌పై కేసు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్స్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ (YCP) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి పోలీసులు వైసీసీ నిరసనల ర్యాలీ (YCC protest rally)లకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికి వైసీపీ నేతలో వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ సహా (Former MP Margani Bharat) వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 13న భరత్ పిలుపుతో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఒక ర్యాలీ నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం, అలాగే ర్యాలీ కారణంగా నగర ప్రజలకు అసౌకర్యం కలిగిందని పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ర్యాలీ ప్రభావంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొని నగరవాసుల స్వేచ్ఛకు అంతరాయం కలిగించినందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌తో పాటు ర్యాలీ నిర్వహణలో ప్రధాన బాధ్యత వహించిన మరో 26 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఇంకా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, కేసుల నమోదు రాజమండ్రి రాజకీయాలను కొత్త దిశలోకి తీసుకెళ్లింది.






