- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP : పున్నమి ఘాట్‌లో కారు బీభత్సం కేసు.. నిందితులు అరెస్ట్
విజయవాడ భవానీపురం పరిధిలోని పున్నమి ఘాట్ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన కారు బీభత్సం ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ భవానీపురం పరిధిలోని పున్నమి ఘాట్ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన కారు బీభత్సం ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ జనంపైకి దూసుకెళ్లిన ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడితో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. భవానీపురం బెరంపార్క్ సమీపంలో కారు ప్రమాదకరంగా నడిపించడాన్ని గమనించిన స్థానికులు నిందితులను ప్రశ్నించగా, వారిపై కోపంతో చంపాలనే ఉద్దేశంతో కారుతో ఢీకొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు జక్కుల దినేశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అరెస్టైన వారిపై గతంలో గంజాయి సహా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిందితులను రోడ్డుపై నడిపిస్తూ భవానీపురం పోలీసులు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.






