- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: శ్రీశైలం ఘాట్ రోడ్లులో తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో కారు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది....

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డు(Srisailam Nallamala Ghat Road)లో కారు ప్రయాణికుల(Car passengers)కు పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా కారులో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుంటూరు(Guntur)కు చెందిన భక్తులు ఇన్నోవా కారులో శ్రీశైలం వెళ్తుండగా చిన్నారుట్ల సమీపంలో ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన భక్తులు.. కారులో నుంచి కిందికి దిగారు. దీంతో ముప్పు తప్పింది. కారు బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఘటనలో కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






