Breaking News : 5.5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ

by Muthe.Rajitha |   (  Updated:2025-01-11 17:36:10  IST  )

బంగారం(Gold) డెలివరీ చేసే వ్యక్తి భారీ విలువైన బంగారు నగలతో ఉడాయించాడు.

Breaking News : 5.5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం(Gold) డెలివరీ చేసే వ్యక్తి భారీ విలువైన బంగారు నగలతో ఉడాయించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad-Vijayawada)లోని ఓ నగల షాపుకు బంగారం డెలివరీ చేసే క్రమంలో.. కారు డ్రైవర్ నగలతో పారిపోయాడు. జగ్గయ్యపేట వద్ద కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చాయ్ కోసం దిగినపుడు, ఇప్పుడే వస్తానంటూ మాయమాటలు చెప్పి సినీ ఫక్కీలో డ్రైవర్ నైస్ గా ఎస్కేప్ అయ్యాడు. డ్రైవర్ బంగారంతో పారిపోయాడాని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. కారులోని జీపీఎస్ ట్రాకర్ సహాయంతో నందిగామలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్ళి చూస్తే కారు వదిలి బంగారం తీసుకొని నిందితుడు పరారయ్యాడు. కాగా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story