Shocking: రాజధాని రైతుల కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

నమ్మి మోసపోయేంత అమాయకులం కాదని రాజధాని రైతుల కీలక ప్రకటన చేశారు...

Shocking: రాజధాని రైతుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati)పై వైసీపీ నేతలు(Ycp Leaders) యూటర్న్ తీసుకున్నట్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను ఆలోచనలు పడేశాయి. అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల పేరుతో ఏంత హడావుడి చేశారో చూసిన ప్రజలకు ప్రస్తుతం ఆ పార్టీ నేతలుచెబుతున్న మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ నేతల్లో ఇంత మార్పా అంటూ ముక్కున వేలువేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని 500 ఎకరాల్లో ఉండాలని, అది కూడా విజయవాడ(Vijayawada), గుంటూరు(Guntur) మధ్య ఉండాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YSRCP leader Sajjala Ramakrishna Reddy) సలహా ఇచ్చారు. ఇప్పుడు సజ్జల చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో సెటైర్లు కురిపిస్తున్నాయి. మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారా..?.. తాము మాత్రం అమాయకులం కాదంటూ కొందరు నెటిజన్లు రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు. సరిగా ఇవే కామెంట్స్ అటు రాజధాని అమరావతి రైతుల నుంచి కూడా వినిపిస్తున్నాయి.

అమరావతిలో మీడియాతో మాట్లాడిన రైతులు.. మరోసారి వైసీపీ మాటలు నమ్మమని తెగేసి చెప్పారు. అలాగే తాము అమాయకులం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిపై వైసీపీ నాయకులు ఇంకా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజధానిపై ద్వేషం తగ్గించుకోవాలని హితవుపలుకున్నారు. మరి రాజధానిపై అమరావతి రైతుల్లో ఈసారి వైసీపీ నేతలు ఎలాంటి నమ్మకం కలిగిస్తారో చూడాలి.

Next Story