- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు.. భూసేకరణ ఇబ్బందులపై ఆవేదన!
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీసులో వైఎస్ జగన్‌ను కలిసిన ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాలకు చెందిన రాజధాని రైతులు. తమకు తెలియకుండా భూసేకరణ నోటిఫికేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆవేదన.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)ని అమరావతి రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) కేంద్ర కార్యాలయానికి పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చి తమ సమస్యలను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మొదటి విడతలో భాగంగా తమకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ (Returnable Flats) విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను జగన్‌కు రైతులు సుదీర్ఘంగా వివరించినట్లు తెలుస్తుంది.
దీంతో పాటు రెండో విడత భూసేకరణ (Land Acquisition) పేరుతో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, తద్వారా స్థానికంగా ఎదురవుతున్న ఇతర సమస్యలను కూడా రాజధాని రైతులు ఆయనకు విన్నవించారు. భూసేకరణ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, కనీసం రైతులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని రైతులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న జగన్, వారికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






