డీఎస్సీ 2025ను రద్దు చేయించండి: జగన్ ఎదుట బోరున విలపించిన అభ్యర్ధులు

by Vemula.Srinu Prasad |

డీఎస్సీ 2025ను రద్దు చేయించాలని జగన్ ఎదుట అభ్యర్ధులు బోరున విలపించారు..

డీఎస్సీ 2025ను రద్దు చేయించండి: జగన్ ఎదుట బోరున విలపించిన అభ్యర్ధులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో డీఎస్సీ 2025(DSC 2025) నోటిఫికేషన్ విడుదలై పరీక్ష నిర్వహించి నియామకాలు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. అయితే అర్హత సాధించలేని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ పరీక్షలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు..వైఎస్ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్ధులు... డీఎస్సీ 2025ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్‌తో పరీక్ష నిర్వహించాలని కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దు చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story