- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా
తన బిడ్డ ఆచూకీ కోసం దివ్యాంగ తండ్రి ఆవేదన.

దిశ, వెబ్ డెస్క్ : పాపం.. ఆయన దివ్యాంగుడు (Specially Abled). ఆయన కూతురు కనిపించకుండా పోయి ఏడాది అవుతోంది. ఏడాది క్రితమే పోలీసులకు తన కూతురు జాడ కనిపెట్టాలని ఫిర్యాదు కూడా చేశాడు. ఫిర్యాదు చేసి ఏడాది పైనే గడుస్తోంది. కానీ నేటికీ ఆయన కూతురి జాడ తెలియదు. ఈ దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది గుంటూరు జిల్లాకు చెందిన ఓ దివ్యాంగుడు. ఆయనకు ఒకవైపు శారీరక వైకల్యం సహకరించకుంటే. మరోవైపు కూతురు జాడ తెలియక మనోవేదన కలుగుతోంది.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా (Gunturu) ఆర్ ఆగ్రహారంలో ఏసోబు (Yesobu) అనే దివ్యాంగుడు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఏడాది క్రితం అతని కూతురు (15) కనిపించకుండా పోయింది. దానిపై అదే ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా కట్టి దర్యాప్తు చేపట్టారు. కానీ కూతురు జాడ మాత్రం కనుగొని చెప్పలేదు. అలా ఒక నాలుగు నెలలు గడిచిన తరువాత ఒక కొత్త నెంబరు నుంచి ఏసోబుకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబరు నుంచి మాట్లాడింది అతని కూతురేనని ఏసోబు చెబుతున్నాడు. బాలిక తాను సికింద్రాబాద్ లో ఉందని చెబుతుంటే ఎవరో ఫోన్ కాల్ కట్ చేశారన్నారు. ఆ విషయాన్ని పోలీసులకు తెలిపినా స్పందన కరువైందని వాపోయాడు.
మరికొన్ని రోజులకు అదే నెంబరు నుంచి ఏసోబుకు ఫోన్ కాల్ వచ్చింది. అటువైపు నుంచి హృదయవిదారకమైన మాటలను అతడు వినాల్సి వచ్చింది. కాల్ చేసిన సదరు వ్యక్తి తన కూతురు చనిపోయిందని చెప్పారని ఏసోబు అంటున్నారు. సంబంధిత ఫోన్ నెంబరును పోలీసులకు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన కూతురు ఏమైందో.. ఎక్కడ ఉందో... ఎవరి దగ్గర ఉందో.. ఎలా ఉందో అని కన్నీరుమున్నీరు అవుతున్నాడు ఏసోబు. ఒకవేళ బ్రతికి ఉంటే తన వద్దకు తీసుకురావాలని లేని పక్షంలో కనీసం ఆమె మృతికి సంబంధించిన విషయాన్ని అయినా తెలియజేయాలని ఏసోబు కోరుతున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు.






