మంటల మిస్టరీ తేలేనా ?

by Anil Sikha |
మంటల మిస్టరీ తేలేనా ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద మంటలు వ్యాపించిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ రోజు సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు పంపారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా.. లేక ఎవరైనా కావాలనే ఈ పనే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 5న జగన్ నివాసం సమీపంలో మంటలు చెలరేగి గడ్డి తగలబడిన విషయం తెలిసిందే. ఈ మంటలకు కారణం ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన వెంటనే మంటలు ఏర్పడిన ప్రాంతాన్ని ఫోరెన్సిక్​ బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో సీసీ టీవీ పేజీ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు

ప్రమాదం జరిగిన రోజున టీడీపీ ఒక ఆరోపణ చేసింది. లిక్కర్స్ స్కామ్ లో దోచుకున్న పత్రాలను తగుల పెట్టారా అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోని కూడా విడుదల చేసింది. లిక్కర్ స్కామ్ లో దోచుకున్న డబ్బుకు సంబంధించిన పత్రాలను తగలబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. వీటిని వైసీపీ కొట్టి పారేసింది. జగన్ నివాసానికి భద్రత కల్పించాలని డిమాండ్​చేసింది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆకతాయిలు ఇక్కడ హల్​చల్ చేస్తున్నారని, వారిని కట్టడి చేయాలంటే భద్రత పెంచాలని కోరింది. వారి అభ్యర్థనల మేరకు జగన్ నివాసానికి వెళ్లే దారిలో పోలీసులు సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు

Next Story

Most Viewed