- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు తప్పు చేయలేదని పవన్ కల్యాణ్ చెప్పగలరా?: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
by Seetharam |
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించరని అన్నారు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని పవన్ కల్యాణ్ చెప్పగలరా? అని సవాల్ విసిరారు. వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టింది అని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న ప్రతీ హామీ వైసీపీ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టిందేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు అంతా క్లియర్‌గా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా అస్థిరత అనేది లేదని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అస్థిరత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.
Next Story






