- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్‌పై దారుణం.. పోక్సో కేసు నమోదు
by Vemula.Srinu Prasad |
కడప జిల్లా మైదుకూరులో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా మైదుకూరు(Maidukuru)లో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని(Students)పై ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే అవమాన భారంతో స్కూలు(School)కు విద్యార్థిని వెళ్లలేదు. దీంతో పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు నిలదీశారు. ప్రిన్సిపల్ లైంగికంగా వేధిస్తున్నాడని, అందుకే స్కూల్ మానేశానని విద్యార్థిని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లుపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు విషయం బయటికి రాకుండా కొంతమంది పెద్దలు స్టేషన్‌లోనే రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Next Story






