ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ ఆగ్రహం.. లెక్కలు సరిగా లేవని నివేదిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 08:48:07  IST  )

ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక గణాంకాలను నివేదికలో కాగ్ వివరించింది...

ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ ఆగ్రహం.. లెక్కలు సరిగా లేవని నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక గణాంకాలను నివేదికలో కాగ్ వివరించింది. రాబడులు, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి కాగ్ నివేదిక విడుదల చేసింది.

కాగ్ నివేదిక:

రెవెన్యూ ఖర్చు రూ. 3,375.60 కోట్లు తక్కువగా చూపారు

క్యాపిటల్ ఖర్చు రూ.2,648.92 కోట్ల ఎక్కువగా చూపారు

నగదు నిల్వలు రూ.95.70 కోట్లు తక్కువగా చూపారు

2024లో రూ. 5,00531 కోట్ల కొత్త రుణాలను షరతులు లేకుండా విడుదల చేశారు

హడ్కోకు రూ.248.25 కోట్లు ఏపీఎస్ఎఫ్సీఎల్‌కు రూ.3.53 కోట్లు నేరుగా చెల్లింపులు జరిగాయి

రూ. 1580.78 కోట్ల సంస్థాగత రుణాల మళ్లింపు

ఏసీ బిల్లుల్లో రూ.527.70 కోట్లకు సంబంధించి 202 బిల్లులు ఇంకా సర్దుబాటు చేయలేదు

పింఛన్, విపత్తు నిధులపై వడ్డీలోటు రూ.811.84 కోట్లు

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన నిధికి రూ.121.56 కోట్ల వడ్డీ చెల్లంచలేదు

ఎస్డీఆర్ఎఫ్ ఫండ్‌కు రూ.295.05 కోట్ల వడ్డీ లోటు

బడ్జెట్ బయట ఉన్న అప్పుల వివరాలు వెల్లడించలేదు

2025 మార్చి 31 నాటికి రూ.27.241.99 కోట్ల ఆఫ్ బడ్జెట్ బాకీలు ఉన్నాయి.

Next Story