- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం 13 జిల్లాలున్న ఏపీని 26గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని జిల్లాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని, మరికొన్ని ప్రాంతాలను దగ్గరగా ఉన్న జిల్లాల్లో కలపాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో జిల్లాల మార్పులు, చేర్పులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు కసరత్తులు చేసింది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. జిల్లా విభజన, పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, రహదారుల మార్గం, శాస్తీయతపై వంటి విషయాలపైనా చర్చించారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు రాజధాని ప్రాంతం అమరావతి జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైనా మంత్రివర్గం ఉప సంఘం చర్చించింది. అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం 5 నుంచి 6 డివిజన్లను ఏర్పాటు చేయాలనే అంశంపైనా చర్చించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రత్యేక ఆథారిటీగా ఏర్పాటు చేయాలనే అంశంపైనా చర్చించారు. ఎన్టీఆర్ జిల్లాలోని గన్నవరం, కైకలూరు, నూజివీడును కృష్ణా జిల్లాకు తీసుకురావాలనే అంశంపైనా విస్తృతంగా చర్చించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు ఏ వీఐపీ వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం భ్రదత కోసం మచిలీపట్నం నుంచి పోలీసులు రావాల్సివస్తుందని, కృష్ణా జిల్లాలోకి తీసుకుంటే పరిపాలన సౌలభ్యం శులభంగా ఉంటుందని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదిస్తోంది. నూజివీడు ప్రాంతం ఏలూరు జిల్లాలకు వెళ్లిందని, భౌగోళికంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనపై చర్చించారు. గతంలో ఉన్న మాదిరిగా కైకలూరును కృష్ణా జిల్లాలో కలిపే అంశంపైనా చర్చించారు. అయితే ఈ నెల 28న మంత్రి మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. గతంలో వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.






