Ap Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం.. 20 అంశాల ఎజెండాపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-17 10:43:10  IST  )

కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది...

Ap Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం.. 20 అంశాల ఎజెండాపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ భేటీ(Cabinet Meet) ప్రారంభమైంది. ఈ సమావేశంలో 20 అంశాల ఎజెండాపై చర్చిస్తున్నారు.. అమరావతి(Amaravati) పనులకు టెండర్ల పిలవాలని నిర్ణయించారు. ఈ మేరుకు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలో పది పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంతేకాదు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపైనా చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. మరోవైపు అమరావతిలో భూకేటాయింపులపైనా చర్చించనున్నారు. ఏ సంస్థలకు భూములు కేటాయించాలనేదానిపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

కాగా ఏపీ రాజధాని(Ap Capital) నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం.. అందుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి పనులు, భూ కేటాయింపులు సహా పలు బిల్లులకు అసెంబ్లీ ద్వారా ఆమోదముద్ర వేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం 20 అంశాల ఎజెండాను రెడీ చేసింది. కేబినెట్ భేటీలో చర్చించి ఆమోద్రముద్ర వేసిన తర్వాత బిల్లులు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు తాజాగా జరుగుతున్న కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు.

Next Story