- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ,డైనమిక్ బ్యూరో: ఈ నెల 11న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదం సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వంటి అంశాలపై సీఎం జగన్ కేబినెట్‌లో చర్చించనున్నారు.
Next Story






