Cabinet Meeting: పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

by Shiva |   ( Updated:2025-02-06 12:25:20.0  )
Cabinet Meeting: పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి మంత్రులు (Ministers), సీఎస్ విజయానంద్ (CS Vijayanand), ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. ఈ మేరకు కేబినెట్‌‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం (AP Government) ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంతో మొత్తం 34 కంపెనీలు ఎంవోయూ(MOU)లు చేసుకున్నాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌‌ (Andhra Pradesh)కు రూ.6 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అన్నారు. ఆ పెట్టుబడులతో 4.28 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పారిశ్రామివేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఎంఎస్ఎంఈ (MSME) పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని అన్నారు. అదేవిధంగా బీసీ (BC), ఎస్సీ (SC), ఎస్టీ (ST) మహిళలకు మేలు జరిగేలా కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. నీరు-చెట్టు (Neeru-Chettu) కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్వాసితులకు పెండింగ్ ఇళ్ల నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలిపామని వివరించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇక నుంచి ప్రభుత్వం పఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో అందించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు.

Next Story