- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ
సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకి జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకి జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనుల పురోగతిపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అదేవిధంగా జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపి.. హెచ్‌వోడీ 4 టవర్ల టెండర్లకు ఆమోదముద్ర వేయనున్నారు. వన మహోత్సవంతో పాటు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే అంతర్జాతీయ ‘యోగా డే’ సెలబ్రేషన్స్‌పై చర్చించనున్నారు. అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై డిస్కస్ చేయనున్నారు. అక్కడే 5 వేల ఎకరాల్లో ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. 2,500 ఎకరాల్లో ఇంటర్‌నేషనల్ స్పోర్ట్స్ కాంపెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ (Smart Industry Hub) నిర్మాణంపై చర్చించనున్నారు. అదేవిధంగా సాయంత్రం P4పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారు.






