- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే
సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం (Secretariat)లో కేబినెట్ భేటీ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం (Secretariat)లో కేబినెట్ భేటీ జరిగింది.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan), మంత్రులు, సీఎస్ విజయానంద్ (CM Vijayanand), ప్రభుత్వం ప్రధాన సలహాదారులు హాజరయ్యారు. ఈ భేటీలో ఏపీలో ఎఫ్ఎస్ఎల్ (FSL) నుంచి డ్రోన్ కార్పొరేషన్ (Drone Corporation)ను డీమెర్జ్ చేయాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదంతో నోడల్ ఏజెన్సీగా డ్రోన్ కార్పొరేషన్ మారనుంది. అనకాపల్లి జిల్లా (Anakapally District)లోని డీఎల్ పురం (DL Puram) వద్ద క్యాపిటివ్ పోర్టు (Captive Port) నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు.
త్రీ స్టార్, ఆపై స్థాయి హోటళ్లు, బార్ లైసెన్స్ ఫీజులను రూ.25లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్, అదేవిధంగా ఏపీ మీడియా అక్రిడేషన్ నింబంధనలు-2025కి మంత్రివర్గం ఒకే చెప్పింది. సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ (Sagar Left Branch Canal Retaining Wall) నిర్మాణ ప్రతిపాదన, జల హారతి కార్పొరేషన్ (Jala Harathi Corporation) ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేయనున్నారు. ఇక రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.






