- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan), మంత్రులు, ఎసీ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో ప్రప్రథమంగా రాజధాని అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు. భారత్ ఆర్మీ (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ (Hyderabad) పదేళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి (Amaravati) పేరిట గెజిట్‌పై కేంద్రాలని కోరాలని కేబినెట్ నిర్ణయించారు.






