- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మాదిరిగా అమరావతి.. రెండో దశకు కేబినెట్ ఆమోదం
అమరావతిలో రెండో దశ భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది....

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) మాదిరిగా ఏపీ రాజధాని అమరావతి(Amaravati)ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 29 గ్రామాల పరిధిలోనే గతంలో భూసేకరణ చేసింది. అయితే హైదరాబాద్‌లా అభివృద్ధి చేయాలంటే ఇంకా మరింత భూమి కావాలని అంచనా వేసింది. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించింది. 25 అంశాల ఎజెండాలతో అమరావతి సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి పరిధిలో రెండో దశ భూసమీకరణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఏడు గ్రామాల పరిధిలోని 16,66.5 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ భూమిని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ప్రాంతాల పరిధిలో సమీకరించేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈభేటీలో మొత్తం 26 ఎజెండా అంశాలపై మంత్రులు చర్చించి ఆమోదం తెలిపారు.






