- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడాకారిణి శ్రీచరణికి రూ. 2.5 కోట్ల నగదు, 500 గజాల ఇంటి స్థలం
క్రీడాకారిణి శ్రీచరణికి భారీగా ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళల ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడాకారిణి శ్రీ చరణి(State athlete Sri Charani)కి ప్రోత్సాహకం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమెకు రూ. 2.5 కోట్ల నగదుతో పాటు విశాఖలో 500 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. 44 అంశాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్ 1బిడ్ల ఆమోదించే బాధ్యతను సీఆర్ డీఎ కమిషనర్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో E 3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలో కుప్పంలో పలార్ నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి 15.96 కోట్ల నిధులను పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 417 టీచర్ పోస్టులను అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంఘిక సంక్షేమం విభాగంలో సామాజిక సేవలో అనుభవం ఉన్న వ్యక్తులను చైర్మన్లు, మెంబర్లుగా నియమించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.






