- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి షాక్.. టీడీపీలోకి సి. రామచంద్రయ్య...!
తెలుగుదేశం పార్టీలో సి. రామచంద్రయ్య చేరతారనే ప్రచారం జరుగుతోంది...

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీలో సి. రామచంద్రయ్య చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నుంచి బలిజ నేతగా, సీనియర్ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అంతేకాదు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు సి. రామచంద్రయ్య దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంలో సి. రామచంద్రయ్య కనిపించడంతో త్వరలో ఆయన సైకిలెక్కబోతున్నారనే ప్రచారం మొదలైంది. కడప జిల్లా రాజంపేట నియోజవకర్గంకు చెందిన సి. రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. వివిధ పార్టీలో చేరి కీలక పదవులను సైతం అలంకరించారు. తాజాగా సి.రామచంద్రయ్య తెలుగుదేశం గూటికి చేరబోతున్నారంటూ రాజంపేటలో ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతోందో చూడాలి.
Next Story






