- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Byreddy Siddharth Reddy: 11 సీట్లు గెలిస్తేనే భయపడుతున్నారు..జగన్ మళ్లీ సీఎం అయితే !
కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

దిశ, వెబ్ డెస్క్: కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. రేపు జగన్ అధికారంలోకి వస్తాడని తెలుసు కాబట్టి ఎవరు సింగపూర్ వెళ్దామా, మలేషియా వెళ్దామా అని మాట్లాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకనే సప్త సముద్రాల అవతల ఉన్న ఎవరిని వదలనని జగనన్న చెప్పారని గుర్తు చేశారు. 11 సీట్లు గెలిచిన తర్వాత వైసీపీకి భయపడుతున్నారని చురకలు అంటించారు. 18 నెలల తర్వాత మనం జైలుకు వెళ్తే జగనన్న మనల్ని గుర్తు పెట్టుకుంటారు అనే విధంగా మా కార్యకర్తలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
జగనన్న దమ్ము గురించి మాట్లాడాలి అంటే మెడికల్ కాలేజీలు విషయం చాలు అన్నారు. ఎవడు టెండర్ కు వస్తారో రండిరా అంటే ఒక్కడు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆవకాయ అమరావతి అంట చివరికి మిగిలేది ఆవకాయ తొక్కే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇక అటు రాచమల్లు కూడా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ కు నిద్రలో కూడా జగన్ గుర్తొస్తే భయపడతారని ఎద్దేవా చేశారు. మేము పవన్ కళ్యాణ్ తాలూకా మేము పవన్ కళ్యాణ్ తాలూకా అని చెబుతారు...ఏం పీకారు అని మీ పవన్ కళ్యాణ్ అంటూ చురకలు అంటించారు. విడిపోతే ఓడిపోతాం అనే భయాన్ని పరిచయం చేసిన మగాడే జగన్ అంటూ వ్యాఖ్యనించారు రాచమల్లు.






