- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ, తిరువూరులో ఉపఎన్నిక వాయిదా.. కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవశం
ఏపీలో రాజీనామాలు, సభ్యుల మృతి కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీలకు ఈ రోజు ఎన్నికలు ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి.

విశాఖలో టీడీపీ కార్పొరేటర్ల అసంతృప్తి
డిప్యూటీ మేయరు అభ్యర్థిగా జనసేన కార్పొరేటర్
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో రాజీనామాలు, సభ్యుల మృతి కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీలకు ఈ రోజు ఎన్నికలు ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. తిరువూరు నగరపంచాయతీ ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజీనామా నేపథ్యంలో నేడు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ నాయ కుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. వైసీపీ కౌన్సిలర్లకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, తిరువూరు ఇంచార్జ్ స్వామిదాసు తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికను వాయిద వేశారు. కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మొత్తం 20 మంది సభ్యు లకు గాను ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. వీటితో పాటు సత్యసాయి జిల్లా గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి ఎంపీపీ స్థానాలకు, కారంపూడి, నరసరావుపేట వైస్ ఎంపీపీ స్థానాలకు, నెల్లూరు జిల్లా దగదర్తి వైఎస్ ఎంపీపీ స్థానానికి, కదిరిలో రెండు వైస్ ఛైర్ పర్సన్ స్థానాలకు ఎన్నిక ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ గా దిల్షా దున్నిషాగ్ ఎన్నికయ్యారు. అదే విధంగా సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గజ్జల సోమశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు.
విశాఖలో హాజరు కాని టీడీపీ సభ్యులు
మరోవైపు ఈ రోజు విశాఖ నగర డిప్యూటీ మేయరు ఎన్నిక జరగాల్సి ఉంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరానికి సరిపడ సభ్యుల రాకపోవడంతో ఎన్నిక జాప్యం జరిగింది. జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం కార్పొ రేటర్లు మాత్రమే హాజరయ్యారు. చివరికి కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సమావేశానికి టీడీపీ సభ్యులు మాజరు కాకపోవడం చర్చకు దారి తీసింది. టీడీపీకి చెందిన ఇద్దరు హాజరు కాలేదు. డిప్యూటీ మేయరు పదవిని పలువురు టీడీపీ సభ్యులు ఆశించారు. కాగా ఈ పదవిని కూటమి.. జనసేనకు కేటాయించింది. ఉదయం సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరును కూటమి నేతలు పంపారు. జనసేనకు చెందిన 64 వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవిం ద్ రెడ్డిని విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పదవులు ఆశించిన టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. జనసేన కార్పొరేటర్దల్లి గోవింద్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఈ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.






