ఆనాడు ఎగతాళి చేస్తే ఇప్పుడు అదే కరెక్ట్ అయింది: జ్యూరిచ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఆనాడు తాను తీసుకున్న నిర్ణయంపై ఎగతాళి చేశారని, ఇప్పుడు అదే కరెక్ట్ అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు..

ఆనాడు ఎగతాళి చేస్తే ఇప్పుడు అదే కరెక్ట్ అయింది: జ్యూరిచ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విజన్ 2020(Vision-2020) అంటే తనను కొందరు 420 అన్నారని, ఐటీ తిండి పెడుతుందా అని విమర్శించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. జ్యూరిచ్‌లో తెలుగు అసోసియేషన్ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థికంగా 2047నాటికి ప్రపంచంలోనే భారత్(Bharat) నెంబర్ వన్ గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 1995 నుంచి జ్యూరిచ్() వెళ్తున్నాని తెలిపారు. అన్ని దేశాల్లో ఎన్ఆర్ టీ ఉండాలని చెప్పారు. చాలా తెలుగు అసోసియేషన్లు ఎన్ఆర్టీతో కలిసి ఉన్నాయన్నారు. 4 కోట్ల మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉంటున్నారని చెప్పారు. 195 దేశాల్లో తెలుగు ప్రజలు ఉండటానికి ఆనాడు తాను తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఉందని వెల్లడించారు. 2028 నాటికి జర్మనీని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీకి పెట్టుబడులు వెల్లువ..

కూటమి ప్రభుత్వంలో ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే డ్రోన్ అంబులెన్స్‌లు రాబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి విషయాన్ని ఆన్ లైన్ చేస్తున్నామని చెప్పారు. డేటా మొత్తం ఆన్ లైన్‌లో ఉంచామన్నారు. రియల్ టైమ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Next Story