- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులో కండక్టర్ డబ్బులు కొట్టేసిన ప్రయాణికురాలు.. కేసు నమోదు
సంక్రాంతి పండగకు సొంతూళ్ల నుంచి తిరుగుపయనమైన ప్రయాణికులతో బస్సులు కిక్కిరిపోతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి(Sankranti) పండగకు సొంతూళ్ల నుంచి తిరుగుపయనమైన ప్రయాణికులతో బస్సులు కిక్కిరిపోతున్నాయి. ఏ బస్టాండ్ చూసిన ఫుల్ రద్దీ(Full Rush)గా కనిపిస్తోంది. ఇక బస్సులో అయితే ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. ఈ రద్దీని అసరాగా చేసుకుని ఓ మహిళా ప్రయాణికురాలు చేతివాటం చూపింది. ఏకంగా కండక్టర్(Conductor) డబ్బులే కొట్టేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం(Panyam)లో జరిగింది. బనగానపల్లె వెళ్తున్న ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో కండక్టర్ డబ్బులు రూ. 6570 నగదు కనిపించలేదు. బస్సు రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఎవరో కొట్టేశారని అనుమానించిన కండక్టర్ నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు. పోలీసులు ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. దీంతో మహిళా ప్రయాణికురాలు గుట్టురట్టు అయింది కండక్టర్ డబ్బులు ఆమే చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొట్టేసిన డబ్బులు కండక్టర్‌కు అందజేశారు. కండక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.






