సైక్లోన్ పంజా.. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను దృష్ట్యా నైట్ హాల్టులు వద్దని సూచించారు. అలాగే రద్దీ ఉండే ..

సైక్లోన్ పంజా.. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను దృష్ట్యా నైట్ హాల్టులు వద్దని సూచించారు. అలాగే రద్దీ ఉండే రూట్లలోనే బస్సులను నడపాలని, అవసరం లేని రూట్లలో తాత్కాలికంగా బస్సుల రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. కాల్వలు, కాజ్ వే లు, కట్టల మీదుగా రెగ్యులర్ గా వెళ్లే బస్సులను ఆ రూట్లలో నడపవద్దని ఆదేశించారు. విశాఖ, కాకినాడలపై తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఆ మార్గాల్లో వెళ్లే బస్సు సర్వీసులను ఇప్పటికే నిలిపివేశారు.

తుపాను దృష్ట్యా రైల్వే శాఖ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి విశాఖ, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నంల మీదుగా వెళ్లే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రద్దు చేసింది. రైళ్లు రద్దు కావడంతో విజయవాడ రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా మారింది.

Next Story