వినుకొండ బస్టాండ్‌లో తొక్కిసలాట.. నలుగురికి గాయాలు

by Vemula.Srinu Prasad |

సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు పయనమైన నేపథ్యంలో బస్టాండ్ లు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి...

వినుకొండ బస్టాండ్‌లో తొక్కిసలాట.. నలుగురికి గాయాలు
X

దిశ, వినుకొండ: సంక్రాంతి(Sankranti) పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు పయనమయ్యారు. దీంతో ప్రయాణికులతో పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్(Vinukonda RTC Bus Stand) సోమవారం కిక్కిరిసిపోయింది. బస్సు ఎక్కే క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడటంతో జరిగిన తోపులాటలో వెల్లటూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ చిన్న వెంకయ్య, పుల్లలచెరువు మండలం ఎండపల్లికి చెందిన ఎస్తేరు రాణి, నూజెండ్ల మండలానికి చెందిన తరిమి కోటేశ్వరమ్మ, పుల్లలచెరువు తండాకు చెందిన బాణావత్ మంత్రి భాయ్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story