బ్రేకింగ్.. రాష్ట్రంలో మరో బస్సు బోల్తా

by Malleboina Mahesh |

నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలో ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తున్న టూరిస్టు బస్సు బోల్తా పడింది. డ్రైవర్, ప్రయాణికులకు గాయాలయ్యాయి.

బ్రేకింగ్.. రాష్ట్రంలో మరో బస్సు బోల్తా
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మరువక ముందే మరో బస్సు బోల్తా ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలో వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 45 మంది ప్రయాణికులతో ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తున్న బస్సు గురువారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికులు సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుండగా.. పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story