- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి హుండీలో రూ.2 వేల నోట్ల కట్టలు.. చూసి షాకైన పూజారులు, అధికారులు
ఆలయానికి వెళ్లే భక్తులు ఎవరైనా దేవుడికి కోరికలు చెప్పుకోవడంతో పాటు కానుకలు సమర్పిస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆలయానికి వెళ్లే భక్తులు ఎవరైనా దేవుడికి కోరికలు చెప్పుకోవడంతో పాటు కానుకలు కూడా సమర్పిస్తుంటారు. కొందరు నగదు, ఇంకొందరు నగలు ఇస్తూ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే.. తాజాగా ఓ భక్తుడు దేవుడికి ఇచ్చిన కానుకలు పూజారులతో పాటు ఆలయ అధికారులు షాకయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి(Tenali) వైకుంఠపురం దేవస్థానం హుండీలో ఓ అపరిచిత భక్తుడు రూ.2 వేల నోట్ల కట్టలు(Two Thousand Notes) వేశాడు. గురువారం హుండీ లెక్కింపులో ఈ విషయం బయటపడింది. ఆ నోట్ల కట్టలు రూ.2 లక్షల 44 వేలు విలువజేస్తాయని తెలిపారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత కాలం కిందట రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. 2023, మే 19న రూ. 2 వేల నోట్లను వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ నోట్లు చెల్లవని తెలిసి భక్తుడు హుండీలో వేశాడని ఆలయ పూజారులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.






